హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ముగిసింది. చివరి పూజా కార్యక్రమాల అనంతరం బాలాపూర్ గణేశుడిని క్రేన్ సహాయంతో మినీ ట్రక్కుపైకి ఎక్కించి గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం బాలాపూర్ గ్రామ బొడ్రాయి వద్దకు గణేశుడి విగ్రహాన్ని తీసుకురాగా.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన లడ్డూ వేలం కార్యక్రమం ప్రారంభమైంది. కమిటీ నిర్ణయించిన ప్రారంభ ధర రూ.1,116తో వేలం ప్రారంభమైంది.
ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డూను సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు దక్కించుకున్నారు. దీంతో గతేడాది నమోదైన రూ.35 లక్షల రికార్డు ధరను అధిగమించి కొత్త రికార్డు నమోదైంది. 2025లో లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి గతేడాది కంటే రూ.4 లక్షలు అధికంగా ధర పలకడంతో బాలాపూర్ లడ్డూ వేలం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.








