అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా ఎమోజీలు!

అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌షిప్ రూమర్స్‌.. వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ ఎమోజీలు!

Summarize with AI

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, పంజాబీ నటి-మోడల్ సమ్రీన్ కౌర్ మధ్య రిలేషన్‌షిప్ ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా సమ్రీన్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ షార్ట్ వీడియోపై అర్ష్‌దీప్ చేసిన కామెంట్ ఆ వార్తలకు మరింత ఊతమిచ్చింది.

వీడియోపై అర్ష్‌దీప్ ఎలుగుబంటి (🐻), రెడ్ హార్ట్ (❤️) ఎమోజీలతో స్పందించగా.. దానికి సమ్రీన్ కూడా రెడ్ హార్ట్ (❤️), లాక్ (🔒) ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. ఈ ఎమోజీల మార్పిడి అభిమానుల దృష్టిని ఆకర్షించడంతో ఇద్దరి మధ్య ఏదో ప్రత్యేక బంధం ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే తమ సంబంధంపై అర్ష్‌దీప్ గానీ, సమ్రీన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ ప్రస్తుతం తన క్రికెట్ కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు తరఫున వైట్‌బాల్ సిరీస్ ఆడిన అతడు టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. వన్డేల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇక ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ కోసం నార్త్ జోన్ జట్టులో అర్ష్‌దీప్‌కు చోటు దక్కింది.

గతంలో గాయం, జట్టు కాంబినేషన్ కారణంగా టెస్టు అరంగేట్రం చేసే అవకాశం కోల్పోయిన ఈ యువ పేసర్, దేశవాళీ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసి మళ్లీ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment