నేడే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌.. ఫలితాలపై ఉత్కంఠ!

నేడే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌.. ఫలితాలపై ఉత్కంఠ!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జడ్పీటీసీ(ZPTC), ఎంపీటీసీ(MPTC) ఎన్నికల ఓట్ల (Vote Counting) లెక్కింపునకు రంగం సిద్ధమైంది. నేడు ఉదయం 8 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలపై (Election Results) రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) విస్తృత ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాలను(Counting Centers) ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 9,062 టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 11,002 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లతో పాటు 28,692 మంది కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం ఓట్లు పోలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (Counting Centers) ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపై పడింది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత రౌండ్లవారీగా ఫలితాల సరళి వెల్లడికానుంది.

స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఫలితాలపై ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే కొద్దీ విజేతలపై స్పష్టత రానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment