కూటమిలో కాపుల ఆవేదన.. పవన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి!

కూటమిలో కాపుల ఆవేదన.. పవన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి!

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో అత్యంత కీలకమైన కాపు సామాజికవర్గంలో ఇప్పుడు తీవ్రస్థాయిలో నిశ్శబ్ద విప్లవం, ఆవేదన రగులుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వ పాలనలో (Alliance Government) కాపు సామాజికవర్గ నేతలు, కార్యకర్తలు మానసిక క్షోభ‌ను అనుభవిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జనసేన (Jana Sena Party) అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అనుసరిస్తున్న వైఖరిపైనే ఈ అసంతృప్తి అంతా వ్యక్తమతుండటం గమనార్హం.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ తన సామాజికవర్గ నాయకులందరినీ పిలిపించుకుని, రాజకీయాల్లో కాపులు (Kapus) ‘పెద్దన్న పాత్ర’ పోషించాలని కోరిన ఉదంతాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. “ఆంధ్రా(Andhra) అనే స్పృహ ఎటూ లేదు.. కనీసం కుల స్పృహ కూడా లేకపోతే ఎలా?” అని నాడు పవన్ కల్యాణ్ అన్న మాటలను గుర్తుచేసుకుని కాపు నేతలు ఇప్పుడు తల్లడిల్లుతున్నారు.

“ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న” అనే సామెతను తమ విషయంలో పవన్ కల్యాణ్ అక్షరాలా నిజం చేశారని కాపు శ్రేణులు (Community Members) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం తమ కోసమే పని చేయాలని తాము కోరడం లేదని.. అయితే కూటమి పాలనలో తమపై అన్యాయం, వంచన, అణచివేత, దాడులు జరుగుతున్నా పవన్ స్పందించకపోవడమే తమను తీవ్రంగా కలచివేస్తోందని వారు వాపోతున్నారు. పవన్ అండ చూసుకునే భాగస్వామ్య పక్షాలు తమపై అణచివేత సాగిస్తున్నాయనేది వారి ప్రధాన ఆరోపణ.

కాపులంతా పవన్ కల్యాణ్‌ను అభిమానిస్తూ, ఆయన వెంటే నడుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్‌ను బాగా చూసుకుంటే చాలు.. ఇక గ్రౌండ్ లెవల్‌లో ఉన్న చిన్నచిన్న కాపు నాయకులను, కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదనే నిర్ణయానికి టీడీపీ(TDP) పెద్దలు వచ్చారని ఆ సామాజికవర్గ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇదే నిజమనేందుకు రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఘటనలే నిదర్శనమని కాపు నాయకుడు దాసరి రాము లాంటి వారు బలంగా ఉదహరిస్తున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు సామాజికవర్గం తీవ్రమైన అణచివేతకు, దాడులకు గురవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మరోవైపు, జనసేనకు కంచుకోట లాంటి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో సైతం టీడీపీ ఎమ్మెల్యేల ఉక్కుపాదం కింద తాము నలిగిపోతున్నామనే వేదన స్వయంగా జనసేన(Jana Sena) క్షేత్రస్థాయి నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ బలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో తాము భాగస్వామిగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అవమానాలకు గురికావాల్సి వస్తోందని వారు కసితో రగిలిపోతున్నట్టు కాపు నాయ‌కుల ప్రెస్‌మీట్లు వింటే అర్థం అవుతోంది.

ఈ నేపథ్యంలో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కాపు సామాజికవర్గం ఎదురుచూస్తోందని ఆ వర్గపు ముఖ్య నాయకులు బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. తాము లేకపోతే రాజకీయంగా పవన్ కల్యాణ్ స్థానం ఏంటో, ఆయనకు గుణపాఠం ద్వారానే తెలిసొచ్చేలా చేయాలని కసికసిగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీనికోసం తదుపరి సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలనే ఆయుధంగా వాడుకుని తమ సామాజికవర్గ సత్తా ఏంటో కూటమి పెద్దలకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు రుచి చూపించాలనే పట్టుదలతో కాపు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతాయో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment