ఏపీలో మ‌రింత ఖ‌రీదవుతున్న‌ వైద్య విద్య

ఏపీలో మ‌రింత ఖ‌రీదవుతున్న‌ వైద్య విద్య

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైద్య విద్య(Medical Education) మరింత ఖరీదుగా మారింది. ప్రైవేట్ మెడికల్(Medical), డెంటల్ కాలేజీల్లో(Dental Colleges) వివిధ కేటగిరీల కింద వసూలు చేసే ట్యూషన్ ఫీజులను (Tuition Fees) పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్(BDS) కోర్సుల ఫీజులను 10 శాతం పెంచగా.. పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల (Super Specialty Courses) ఫీజులను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఏ కేటగిరీ ఫీజును రూ.18,150కి పెంచారు. బీ కేటగిరీ ఫీజును రూ.14.52 లక్షలకు, సీ కేటగిరీ ఫీజును రూ.43.56 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అదే విధంగా డెంటల్ కాలేజీల్లోనూ (Dental Colleges) ఫీజులను పెంచారు. బీడీఎస్ ఏ కేటగిరీ ఫీజు రూ.15,730కి చేరింది. బీ కేటగిరీ ఫీజును రూ.4.84 లక్షలకు, సీ కేటగిరీ ఫీజును రూ.14.52 లక్షలకు పెంచారు.

మరోవైపు పీజీ వైద్య విద్యలోనూ ఫీజులను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ప్రొఫెషనల్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు 2026-27 విద్యా సంవత్సరానికి కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.

2025-26 విద్యా సంవత్సరానికి నిర్ణయించిన ప్రస్తుత ఫీజుపై 15 శాతం పెంపును అమలు చేసి.. 2026-27 విద్యా సంవత్సరానికి సూపర్ స్పెషాలిటీ కోర్సుల (Super Specialty Courses)ట్యూషన్ ఫీజును రూ.19,83,750గా నిర్ణయించింది.

ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య ఖర్చులు భారీగా ఉంటుండగా.. తాజాగా ఫీజుల పెంపుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీ, సీ కేటగిరీల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే కుటుంబాలకు పెరిగిన ఫీజులు గుదిబండగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment