నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్- 3 (HIT – 3)’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శైలేష్ కొలను (Director Sailesh Kolanu) తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. చిత్రంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ (Trailer) సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.
హిట్-3 సినిమాకు ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) టికెట్ (Ticket) అనుమతి ఇచ్చింది. చిత్ర యూనిట్ చేసిన విజ్ఞప్తికి స్పందనగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (Official Orders) జారీ చేసింది. వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్స్ (Single Screens)లో రూ.50, మల్టీప్లెక్స్ (Multiplexes) లలో రూ.75 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అంగీకరించింది. ఈ పెరిగిన ధరలు వారంరోజులు (One Week) మాత్రమే అమల్లో ఉండనున్నాయి.
ఇక, తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ ధరలు పెంపు విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. గతంలో ‘పుష్ప 2’ చిత్రం విడుదల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంగా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేసింది.








