ఏపీలో‘జనగణన’.. తినే తిండిపై కూడా ఆరా

ఏపీలో‘జనగణన’.. తినే తిండిపై కూడా ఆరా

ఏపీలో రేపటి నుంచి ‘జనగణన – 2006’ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు డైరెక్టర్ నివాస్ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. జనగణన ప్రక్రియలో భాగంగా మొదటి దశలో గృహాల లెక్కింపు (House Listing) చేపడతామని డైరెక్టర్ తెలిపారు. ఇళ్ల సంఖ్య, ఆ ఇళ్లలో నివసిస్తున్న వారి ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం ఈ దశలో ప్రధాన లక్ష్యం.

ఆహార అలవాట్లపై ఆరా
ఈసారి జనగణనలో కొన్ని కీలక మార్పులు చేసినట్లు నివాస్ తెలిపారు. ప్రజలు తీసుకునే ఆహార వివరాలపై ప్రధానంగా ఆరా తీస్తామని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని పోషకాహార లభ్యత, ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ గణనలో ప్రజల కులం (Caste) లేదా మతం (Religion) వంటి సున్నితమైన వివరాలను సేకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

డేటా సెక్యూరిటీ
ప్రజలు ఇచ్చే వ్యక్తిగత వివరాల గోప్యత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, డేటా సెక్యూరిటీపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జనగణన విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డైరెక్టర్ హెచ్చరించారు. అధికారులకు స‌హ‌క‌రించ‌కుండా ఆటంకాలు క‌లిగించే వారిపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment