పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. లీటర్ పెట్రోల్‌పై ఏపీలో వాహనదారులు ఏకంగా రూ.31.80 పన్ను చెల్లిస్తున్నారని అక్టోబర్ 2026కు సంబంధించిన గణాంకాలు సూచిస్తున్నాయి. తెలంగాణలో పెట్రోల్ ట్యాక్స్ రూ.30.20గా ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులపై పెట్రోల్ పన్నుల భారం అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
లీటర్ పెట్రోల్‌పై కేరళలో రూ.29.70, మధ్యప్రదేశ్‌లో రూ.28.40, కర్ణాటకలో రూ.25.50 చొప్పున రాష్ట్ర పన్నులు ఉన్నాయి. కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో లీటరుకు రూ.6.30 అదనంగా పన్ను వసూలవుతోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో రూ.1.60 ఎక్కువ.
అధికారంలోకి వచ్చాక పెట్రోల్ ధరలు తగ్గిస్తానని, యువగళం పాదయాత్రలో పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి సెల్ఫీ ఫొటోలు తీసుకొని హడావుడి చేసిన నారా లోకేష్.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. పెట్రల్ ధరలు తగ్గింపు మాటలు అటుంచి.. పన్నుల రూపంలో వాహనదారుల నడ్డివిరుస్తోందని చంద్రబాబు ప్రభుత్వంపై వాహనదారులు మండిపడుతున్నారు.
బంకుల ముందు సెల్ఫీలతో హడావిడి చేసిన నారా లోకేష్.. లీటర్ పెట్రోల్‌పై రూ.31.80 వసూలు చేస్తున్నందుకు ఏం సమాధానం చెబుతారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ దిగిపోయే నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ.108 ఉంటే.. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో రేట్లు తగ్గకపోగా రూ.10 ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.117.25. దీంట్లో వాహనదారులు చెల్లిస్తున్న పన్ను ఏకంగా రూ.31.80 కావడం గమనార్హం.
పెట్రోల్ ధరల్లో అధిక పన్నుల కారణంగా వాహనదారుల ఖర్చులు పెరుగుతున్నాయి. వీటికి తోడు నిత్యావసర ధరల పెరుగుదల.. కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక భారంతో నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.








