172 మంది ప్ర‌యాణికులున్న విమానంలో మంటలు

172 మంది ప్ర‌యాణికులున్న విమానంలో మంటలు

Summarize with AI

అమెరికాలో ఇటీవల వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. విమానాలు కూలిపోవడం, మంటలు చెలరేగడం వంటి ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా అమెరికాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. 172 మంది ప్రయాణికులున్న‌ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
విమానాశ్రయ అధికారుల సమాచారం ప్రకారం, ఎయిర్‌పోర్టు గేట్ C38 వద్ద బ‌య‌ల్దేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో మంటలు చెలరేగాయి. టార్మాక్ పైకి దట్టమైన నల్లటి పొగ ఎగసిపడింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

ఇంజిన్ సమస్యపై దర్యాప్తు
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1006లో ఇంజిన్ సంబంధిత సమస్యలు తలెత్తినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానంలోని 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానం నుంచి సురక్షితంగా బయటపడి టెర్మినల్‌కు వెళ్లారు.

Join WhatsApp

Join Now

Leave a Comment