ప‌వ‌న్ కుటుంబానికి మ‌రో ప‌ద‌వి..

ప‌వ‌న్ కుటుంబానికి మ‌రో ప‌ద‌వి..

Summarize with AI

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుటుంబానికి ప్ర‌భుత్వ ప‌ద‌వులు వ‌రిస్తున్నాయి. కొణిదెల కుటుంబంలో డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. అన్న నాగేంద్ర‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌గా, ఇటీవ‌లే ఆయ‌న‌కు కేబినెట్ ర్యాంక్‌తో కూడిన ఏపీ గ్రీన్‌కో క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. తాజాగా చిరంజీవి కుమార్తె సుష్మిత‌కు కూట‌మి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది.

చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్‌ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్య‌ద‌ర్శి క‌న్న‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిష్టాత్మక దేవస్థానం ట్రస్ట్‌ బోర్డులో సుస్మితకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ‌లోని ప్ర‌తిష్టాత్మ‌క యాద‌గిరి గుట్ట దేవ‌స్థానం ట్ర‌స్టు బోర్డు మెంబ‌ర్‌గా మెగాస్టార్ భార్య సురేఖ‌కు అవ‌కాశం క‌ల్పించింది రేవంత్ స‌ర్కార్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొణిదెల కుటుంబానికి ప‌ద‌వుల వ‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

దుర్గ‌గుడి ప్రత్యేక ఆహ్వానితురాలిగా సుష్మిత‌కు అవ‌కాశం క‌ల్పించ‌డంపై ఏపీ జ‌నాలు భ‌గ్గుమంటున్నారు. ఈ నియామ‌కంపై సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. కూటమి ప్ర‌భుత్వంలో ప‌వ‌న్ కుటుంబానికి ప‌ద‌వులు ప్యాకేజీ ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment