భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) జయంతి సందర్భంగా గుజరాత్‌లోని (Gujarat) లోక్ భవన్ (Lok Bhavan) వద్ద ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. భారత రాజ్యాంగ శిల్పి అయిన బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన సమానత్వ మార్గం దేశానికి ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించగా, పలు రాష్ట్రాల్లో కార్యక్రమాలు, సభలు నిర్వహించి ఆయన ఆలోచనలను ప్రజలకు చేరవేశారు.
ఇక న్యూఢిల్లీ (New Delhi) పార్లమెంట్ (Parliament) ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రధానంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi), కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ తో పాటు కేంద్ర మంత్రులు, అధికారులు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు. అంబేద్కర్ గారి సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం చేసిన పోరాటం ఈ తరం యువతకు స్ఫూర్తినిస్తోందని నాయకులు పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఆయన పాత్ర అపారమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.








