అమరావతి (Amaravati) అసైన్డ్ భూముల కేసు (Assigned Lands Case) విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. భూములు ఇచ్చి నష్టపోయిన రైతులకు (Farmers) న్యాయం జరగాల్సిందేనని, వారి హక్కులకు భంగం కలిగితే కోర్టు జోక్యం చేసుకుంటుందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్ విధానం(Land Pooling System), సంబంధిత చట్టాలపై రైతులకు అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది. విస్తృత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేస్తామని, రైతులకు దక్కాల్సిన పరిహారం వారికి చేరాల్సిందేనని పేర్కొంది.
ఇక, రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పక్షాన నిలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైతుల హక్కులకు భంగం కలిగితే తగిన దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించింది.







