‘మీ ఎన‌ర్జీ అలాగే ఉంచుకోండి’.. – ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ కీలక సందేశం

'మీ ఎన‌ర్జీ అలాగే ఉంచుకోండి'.. - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ కీలక సందేశం

Summarize with AI

త్వ‌ర‌లో రాజ‌కీయ అరంగేట్రం (Political Entry) ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ అభిమానుల‌కు అల్లు అర్జున్ కీల‌క సందేశం ఇచ్చారు. అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ అసోసియేష‌న్ స‌మ్మిట్‌లో (Fans Association Summit) బ‌న్నీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్, ద్వేషపూరిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని అభిమానులకు సూచించారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్లను వదిలేయండి. వాళ్లను ట్రోల్ (Troll) చేయడం, ద్వేషించడం చేయొద్దు. వాళ్ల కోసం మీ సమయం, డబ్బు వృథా (Money Waste) చేసుకోవద్దు” అని అన్నారు. ప్రతి ఒక్కరికీ రోజూ ఉండే సమయం, శక్తిని తమ వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ఉపయోగించుకోవాలని అల్లు అర్జున్ సూచించారు.

“రోజూ మీకు ఉండే ఎనర్జీని (Energy) మీకోసం, మీ కుటుంబం (Family) కోసం వాడండి. ఆ సమయాన్ని మీ అభివృద్ధికి ఉపయోగించుకోండి. మీ ఎనర్జీని ఇలాగే పాజిటివ్‌గా (Positively) ఉంచుకోండి” అంటూ అభిమానులకు సందేశం ఇచ్చారు.

అల్లు అర్జున్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకోవడంలో, వారి గురించి ఆలోచించే విషయంలో అల్లు అర్జున్ శైలి ప్రత్యేకమంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అభిమానులను ట్రోలింగ్‌కు దూరంగా ఉండాలని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించడం ప్రశంసలు అందుకుంటోంది.

ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ మీటింగ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment