అల్లు అర్జున్ కొత్త ఇంటి కి

అల్లు అర్జున్ కొత్త ఇంటి కి

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన కలల ఇంటిని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించుకుంటున్నారని సమాచారం. జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నివాసానికి సమీపంలోనే సుమారు 4 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ లగ్జరీ మేన్షన్ రూపుదిద్దుకుంటోంది. గ్లోబల్ డిజైన్ కాన్సెప్ట్‌తో నిర్మాణం జరుగుతుండగా, ఇందుకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల అల్లు అర్జున్ ముంబైకి (Mumbai) షిఫ్ట్ అవుతున్నారనే ప్రచారం వచ్చినప్పటికీ, అది పూర్తిగా తాత్కాలికమేనని తెలుస్తోంది. తన రాబోయే ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా మాత్రమే ఆయన అక్కడ ఉంటారని సమాచారం. ప్రస్తుతం అల్లు అరవింద్‌తో (Allu Aravind) కలిసి ఉంటున్న బన్నీ, నిర్మాణ పనులు పూర్తయ్యాక ఈ ఏడాది చివర్లోనే తన కుటుంబంతో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment