ప్రస్తుతం ఏపీలోని (Andhra Pradesh)అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం(Visakhapatnam). ఈ కార్పొరేషన్‌పై ”ముఖ్య” సన్నిహితుడి కన్నుపడిందా..? ఇప్పటికే విశాఖలో అతి విలువైన ఆస్తులను ధ్వంసం చేస్తున్న అతనికి ఏకంగా విశాఖపట్టణాన్నే అప్పగించేందుకు తెరవెనుక రాజకీయం నడుస్తుందా..? అంటే స్థానికంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ చర్య విశాఖ వాసులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
విశాఖపట్నం మేయర్ పదవిపై (Mayor Post) బీజేపీకి(BJP) చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కన్నుపడినట్టుగా చర్చ జరుగుతోంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో సీఎం రమేష్ (CM Ramesh) తన భార్య (Wife)శ్రీదేవిని (Sridevi) రంగంలోకి దింపడానికి ముమ్మరంగా పావులు కదుపుతున్నారట. కేంద్రంలో ఉన్న పలుకుబడిని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో(Chandrababu) తనకున్న అనుబంధాన్ని ఉపయోగించుకొని భార్యను విశాఖ మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని సీఎం రమేష్ భావిస్తున్నారని సమాచారం. బీసీ రిజర్వేషన్‌లో(BC Reservation) ఉన్న స్థానాన్ని ఓసీ మహిళ లేదా ఓపెన్ కేటగిరి కింద రిజర్వు చేయించి, తన భార్య శ్రీదేవిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ, ఆయన భార్య శ్రీదేవి సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈ వ్యూహంతో మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తుండటంతో స్థానిక బీసీ నాయకుల్లో తీవ్ర కలవరం మొదలైంది.
ఇప్పటికే పంచదార్ల కొండను (Panchadarla Hill) తవ్వేసి కోట్ల రూపాయల విలువైన గ్రావెల్‌ను (Gravel) తరలించేశారు. ఇప్పుడు పరవాడ మండలం మర్రిపాలెంలో అర్ధరాత్రి వేళ కొండలను నిలువునా తవ్వేస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు సీఎం రమేష్ కళ్లు నేరుగా విశాఖ మేయర్ సీటుపై పడ్డాయా..? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార అండతో సీఎం రమేష్ అడ్డగోలుగా దోపిడీ చేస్తూ స్థానికులను తీవ్రంగా అనగదొక్కుతున్నారని బీసీలు గుర్రుగా ఉన్నారు.
మేయర్ సీటుపై తాజా పరిణామాల నేపథ్యంలో స్థానిక బీసీలు, ప్రజలు అప్రమత్తమయ్యారు. కూటమి ప్రభుత్వం పొరపాటున ఇటువంటి నిర్ణయం తీసుకుంటే పార్టీలకు అతీతంగా అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించడానికి సిద్ధమయ్యారు.
ఇప్పటికే విశాఖ ఎంపీ స్థానాన్ని స్థానికేతరులకు కేటాయించడం వల్ల స్థానిక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు మేయర్ పీఠాన్ని కూడా స్థానికేతరులకు వదులుకుంటే తాము విశాఖను విడిచిపెట్టి వెళ్లాల్సిందేనని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికార కూటమి శ్రీదేవిని బరిలోకి దింపితే కచ్చితంగా ఓడి తీరుతామని హెచ్చరిస్తున్నారు.








కరువు నేలపై ఇవేం మాటలు.. లోకేష్ తీరుపై విమర్శలు