పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అభినందించింది. అయితే, ఈ అవార్డుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్టుపై విమర్శలు చేస్తూనే కొన్ని ప్రశ్నలు వేశారు.
“తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తనొక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా?” అని ప్రశ్నించారు. “జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అర్జున్ పాత్ర ఉందా? లేదా? ఆయనకు బెయిలొచ్చినా, నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్లు కాదా?” అని ప్రశ్నించారు. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు తిరిగి ఇస్తాడా? అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కామెంట్స్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చను రేపుతున్నాయి. కాగా, బన్నీ అభిమానులు మాత్రం మల్లన్నపై ఫైర్ అవుతున్నారు.








