బన్నీ – అట్లీ కాంబో: ‘AA22’ ప్రకటనతో ఫ్యాన్స్‌ ఖుషీ

బన్నీ – అట్లీ కాంబో: ‘AA22’ ప్రకటనతో ఫ్యాన్స్‌ ఖుషీ

Summarize with AI

పుష్ప తో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించిన ఐకాన్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun) ఇప్పుడు మరోసారి పాన్‌ ఇండియా రేంజ్‌ (Pan-India) లో తనదైన ముద్ర వేసేందుకు రెడీ అయ్యాడు. బన్నీ–అట్లీ (Bunny-Atlee) కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త సినిమా ‘AA22’కు సంబంధించిన అధికారిక ప్రకటన (Official Announcement) ఇవాళ విడుదలైంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్‌ అప్‌డేట్‌ ఫ్యాన్స్‌ (Fans)ను ఖుషీ (Happy) చేసింది.

ఈ సినిమాను కోలీవుడ్‌ టాప్‌ బ్యానర్‌ ‘సన్ పిక్చర్స్‌ (Sun Pictures)’ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. దర్శకుడు అట్లీ ఇప్పటికే తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ తన మార్క్‌ చూపించాడు. విజయ్‌తో చేసిన మెర్సల్, బిగిల్, తేరి వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత, షారుక్ ఖాన్‌తో జవాన్ రూపొందించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ కాంబో వస్తుందంటే, ఇది ఓ చరిత్ర సృష్టించే ప్రాజెక్ట్‌గా అభిమానులు భావిస్తున్నారు. ఈ కలయిక ఇండియన్‌ బాక్సాఫీస్‌ రికార్డులను మించి మరొక రేంజ్‌కు తీసుకెళ్తుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment