బాలీవుడ్ (Bollywood) మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) మరోసారి నిజ జీవిత ఘటన ఆధారంగా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ (Meghalaya) హనీమూన్ (Honeymoon) హత్య కేసుపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ కేసులోని అనూహ్య మలుపులు, ట్విస్టులు అమీర్ ఖాన్‌ను ఎంతగానో ఆకర్షించాయని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. రాజా రఘు వంశీ హత్య, ఆ హత్యలో అతని భార్య సోనమ్ పాత్రపై అనుమానాలు ఈ కేసులో ప్రధానాంశాలుగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జరిగిన కుట్రను వెండితెరపై ఆసక్తికరంగా చూపించాలనే ఉద్దేశంతో అమీర్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో నిమగ్నమైనట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్టుపై ఆయన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
గతంలో ‘తలాష్’ వంటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అమీర్, మరోసారి ప్రజల మనసులను కదిలించే కథతో ముందుకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటీవల విడుదలైన ‘సీతారే జమీన్ పర్’ సినిమాకు మంచి స్పందన లభించినా, వసూళ్ల పరంగా ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక ‘లాల్ సింగ్ చడ్డా’ అయితే అమీర్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ప్రస్తుతం ఆయన ‘మహాభారతం’ ప్రాజెక్టుపై కూడా దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో అతిథి పాత్రలో అమీర్ కనిపించనున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, హనీమూన్ హత్య కేసును తెరపైకి తీసుకొస్తే, అది దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసే అవకాశం ఉంది. అమీర్ మరోసారి తన క్రైమ్ థ్రిల్లర్ ఇమేజ్ను తిరిగి తెచ్చుకోబోతున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్