టాలీవుడ్లో ఒకప్పుడు ‘బుట్టబొమ్మ’గా భారీ క్రేజ్ సంపాదించిన పూజా హెగ్డేకు ఇప్పుడు వరుస పరాజయాలు సవాల్‌గా మారాయి. ‘అల వైకుంఠపురములో’, తమిళంలో ‘బీస్ట్’ తర్వాత ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. బాలీవుడ్‌లోనూ ‘హౌస్‌ఫుల్ 4’ మినహా చెప్పుకోదగ్గ హిట్ లేకపోవడంతో కెరీర్‌పై ప్రభావం పడుతోంది. ఇటీవల ‘కూలీ’లో స్పెషల్ సాంగ్‌తో సందడి చేసిన పూజా.. ‘రెట్రో’, ‘జన నాయగన్’ వంటి చిత్రాల్లోనూ కనిపించింది. అయినప్పటికీ విజయాలు మాత్రం ఆమెకు దూరంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘శ్రీశ్రీ’, తమిళంలో ‘కాంచన 4’ వంటి సినిమాలపై ఆమె ఆశలు పెట్టుకుంది.
మరోవైపు అహాన్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘సంకీ’ సినిమా కూడా పూజా కెరీర్‌కు కీలకంగా మారింది. 2024లోనే ఈ చిత్రానికి అంగీకరించినప్పటికీ, షూటింగ్ మధ్యలో నిలిచిపోయింది. అక్టోబర్ 30 నుంచి మళ్లీ చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం చేతిలో పరిమిత సినిమాలే ఉండటంతో పూజా తన తదుపరి ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకుంది. రాబోయే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే మళ్లీ వరుస అవకాశాలు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా టాలీవుడ్లో తన పాత క్రేజ్‌ను తిరిగి సంపాదించుకోవాలంటే ఒక బలమైన హిట్ అవసరం. మరి బుట్టబొమ్మ ఈ సినిమాలతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.








