టీమిండియాలో అవకాశాలు లేవా? చాహల్ కీలక నిర్ణయం

టీమిండియాలో అవకాశాలు లేవా? చాహల్ కీలక నిర్ణయం

Summarize with AI

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. 2025 సీజన్‌లో నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్లబ్ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత చాహల్ ఇంగ్లండ్‌కు వెళ్లి జూన్ నుంచి సీజన్ ముగిసే వరకూ అక్కడ క్రికెట్ ఆడతాడు.

అతడు రెడ్‌బాల్ క్రికెట్‌తో పాటు రాయల్ లండన్ వన్డే కప్‌లోనూ పాల్గొంటాడు. ఇదే అతని రెండోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడటం. 2023లోనూ నార్తాంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చాహల్, కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి జట్టును డివిజన్ టూ లో నాల్గవ స్థానానికి చేర్చాడు.

చాహల్ ఏమంటున్నాడు?
“గత సీజన్‌లో కౌంటీల్లో ఆడిన అనుభవాన్ని నేను ఎంతో ఆస్వాదించాను. మళ్లీ నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ క్లబ్ డ్రెస్సింగ్ రూమ్‌లో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి మళ్లీ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసాము. ఈసారి ఇంకా బలంగా పోటీ ఇస్తామని నమ్మకం” అని చాహల్ అన్నాడు.

చాహల్ ఇటీవల జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. చివరగా 2023లో భారత్ తరఫున మ్యాచ్ ఆడిన అతడు, 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు అతడిని రూ.18 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment