విజయవాడ నగరంలో భయానక సంఘటన చోటుచేసుకుంది. రమేశ్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ రోడ్డుపై పార్క్ చేసి ఉంది. రోడ్డుపై పార్కింగ్‌లో ఉన్న అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంబులెన్స్ పూర్తిగా దగ్ధమై నిప్పుకణంగా మారిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.
బస్టాండ్‌కు కూడా మంటల ప్రభావం
అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బస్టాండ్‌ను కూడా ప్రభావితం చేశాయి. దీంతో బస్టాండ్ పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటన ఆస్పత్రికి ఎదురుగా జరిగినందున రమేశ్ హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఫైర్ ఎక్విప్మెంట్తో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అంబులెన్స్ పూర్తిగా కాలిపోయింది.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విజయవాడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆగి ఉన్న అంబులెన్స్‌లో మంటలు ఎలా చెలరేగాయనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.








