నేటితో ముగియ‌నున్న పోసాని పోలీస్ క‌స్ట‌డి

నేటితో ముగియ‌నున్న పోసాని పోలీస్ క‌స్ట‌డి

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నేడు (రెండో రోజు) కూడా ఆయనను ప్రశ్నించనున్నారు. నేటితో పోసాని కస్టడీ ముగియనుండటంతో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించి పోలీసులు పలు కీలక ప్రశ్నలు అడగనున్నారు.

కర్నూలు జైలుకు తరలింపు
రాత్రి 2 గంటలకు పోసానిని కర్నూలు జైలుకు తీసుకురాగా, అక్కడి నుండి విజయవాడ భావానీపురం పోలీసులు పిటి వారెంట్ పై తీసుకెళ్లి అరెస్టు చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ రిమాండ్ కు ఆదేశించడంతో తిరిగి కర్నూలు జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆదోని ట్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను దూషించారనే ఆరోపణలతో పోసాని అరెస్ట్ అయ్యారు.

కీలకమైన బెయిల్ పిటిషన్
రేపు పోసాని బెయిల్ పిటిషన్ పై కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే కస్టడీ కోరిన ఆదోని పోలీసుల పిటిషన్ పై మేజిస్ట్రేట్ తీర్పును రిజర్వ్ చేయడంతో, పోసాని కేసు చుట్టూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోసాని బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై రాబోయే తీర్పు ఏవిధంగా ఉంటుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment