కేసీఆర్ విలువ ప్ర‌జ‌ల‌కు తెలిసొస్తుంది.. – కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

కేసీఆర్ విలువ ప్ర‌జ‌ల‌కు తెలిసొస్తుంది.. - కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

Summarize with AI

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మ‌రోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ స‌మ‌క్షంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గడచిన 48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం రాష్ట్రంలో వ్యవసాయ రంగం దుస్థితికి అద్దం ప‌డుతుంద‌న్నారు. రైతులు చ‌నిపోతున్నా (Farmers Issues) ప‌ట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, ప్రజల సమస్యల్ని పక్కనపెట్టి గాల్లో చక్కర్లు కొడుతున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

35 సార్లు ఢిల్లీకి రేవంత్‌..
ఇప్పటివరకు 35 సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి ఏం సాధించార‌ని ప్ర‌శ్నించారు. నేడు 36వ సారి వెళ్లి కూడా చేసేది ఏమీ లేద‌న్నారు. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. క‌నీసం మంత్రివర్గ విస్తరణ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాడ‌ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేర‌ని, ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వం కూడా క‌రువైంద‌న్నారు. కేసీఆర్ విలువ ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతోంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆ పార్టీని వ‌దిలి ప్రతిపక్షంలో చేర‌డం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment