---Advertisement---

కోహ్లీ రికార్డ్‌ సెంచ‌రీ.. అనుష్క రియాక్ష‌న్ వైర‌ల్‌

కోహ్లీ రికార్డ్‌ సెంచ‌రీ.. అనుష్క రియాక్ష‌న్ వైర‌ల్‌
---Advertisement---

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశం పాకిస్తాన్‌పై శ‌త‌కం సాధించిన కింగ్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ICC ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ పేరిట‌ 5 ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఉన్నాయి. మరే ఇతర ప్లేయర్ ప్రత్యర్థి జట్టుపై 3 కంటే ఎక్కువ అవార్డులు సాధించలేదు.

దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీ బాది, మ్యాచ్‌ను గెలిపించారు. కోహ్లీ శ‌త‌కంపై అనుష్క స్పందించిన తీరు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ్యాచ్ విన్నింగ్ అనంత‌రం విరాట్ కోహ్లీ త‌న స‌తీమ‌ణి అనుష్క‌తో వీడియో కాల్ మాట్లాడాడు. ఫోన్ కాల్‌లో విరాట్ కెమెరాకు బొటనవేలు పైకి చూపిస్తున్న స్క్రీన్ షాట్‌ను అనుష్క ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. అనుష్క పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment