విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. సమంత స్ట్రాంగ్ రియాక్ష‌న్

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. సమంత స్ట్రాంగ్ రియాక్ష‌న్

Summarize with AI

ఇటీవల కేరళకు చెందిన ఓ విద్యార్థి ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలచివేసింది. ఈ సంఘటనపై ప్రముఖ నటి సమంత తీవ్రంగా స్పందించారు. సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయంలో తన బాధను వ్యక్తం చేశారు.

“ఇది 2025 అయినప్పటికీ, ద్వేషం, వేధింపులతో నిండిన కొంతమంది వల్ల ఓ యువ జీవితం కోల్పోయింది. ఎవరికైనా వేధింపులు, బెదిరింపులు ఎదురైతే, అవి బయట పెట్టాలి. బాధితులకు మద్దతుగా నిలిచి, న్యాయం కోసం పోరాడాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ తన భావాలను పంచుకున్నారు.

సమాజంలో ర్యాగింగ్, వేధింపులపై గట్టి నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె పరోక్షంగా సూచించారు. సమంత పోస్ట్‌పై అభిమానులు, నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment