పంచాయతీ కార్యదర్శిపై జనసేన నేత తీవ్ర వ్యాఖ్యలు

పంచాయతీ కార్యదర్శిపై జనసేన నేత తీవ్ర వ్యాఖ్యలు

Summarize with AI

పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిపై జ‌న‌సేన నేత రెచ్చిపోయాడు. క‌న్నెర్ర‌జేసి బూతులు తిడుతూ ఊగిపోయాడు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో విగ్రహాల ఏర్పాటుపై చోటుచేసుకున్న వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ చలమలశెట్టి రమేశ్ పంచాయతీ కార్యదర్శిని తీవ్ర పదజాలంతో దూషించారు. ప్రజల సమక్షంలోనే ఆయన “ఒరేయ్.. తోలుతీస్తా” అంటూ హెచ్చరించడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విగ్రహాల ఏర్పాటుతో మొదలైన వివాదం
ఎనికేపాడుకు చెందిన టంకశాల సుబ్బారావు ఇటీవల జనసేనలో చేరారు. గ్రామంలోని చిన్న బస్టాప్‌ వద్ద జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆయన పంచాయతీకి తన ప్రతిపాదనను సమర్పించారు. పంచాయతీ సమావేశం దీనికి అనుమతి ఇవ్వగా, పదిరోజుల క్రితం వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు.

అయితే, అదే ప్రదేశంలో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో గ్రామస్థుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక వర్గం దీనికి మద్దతు ఇవ్వగా, మరో వర్గం వ్యతిరేకించింది. ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటుచేసుకోవడంతో పంచాయతీ కార్యదర్శి వివాదాన్ని సమసిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఇదే సందర్భంలో జనసేన నేత రమేశ్, కార్యదర్శిపై నోరు పారేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ అంతు చూస్తా, నీ తోలు తీస్తాన‌ని బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment