తిరుమల భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన

తిరుమల భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగిసాయి. ఈ నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి ఎలాంటి ప్రత్యేక టోకెన్లు లేకుండా భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామని ప్రకటించారు.

వీఐపీ దర్శనానికి కొత్త మార్గదర్శకాలు
ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖల ఆధారంగా వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అలాగే, ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీని కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈసారి 7.5 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు సమాచారం.

భక్తులకు సూచనలు
వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన నేపథ్యంలో నేటి నుండి సాధారణ భక్తులకు సర్వదర్శనాన్ని అనుమతిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. దర్శన ఏర్పాట్ల గురించి భక్తులు అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా సమాచారం తెలుసుకోవాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment