నంద్యాల జిల్లా(Nandyal District) అహోబిలంలో(Ahobilam) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) సందర్భంగా చోటుచేసుకున్న ఘటన విషాదాంతమైంది. టీడీపీ(TDP) ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) కాన్వాయ్‌లోని (Convoy) స్కార్పియో వాహనం (Scorpio Vehicle) ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వైసీపీ(YSRCP) సానుభూతిపరురాలు నాగలక్ష్మి (Nagalakshmi) చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగలక్ష్మి మృతితో అహోబిలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈనెల 26వ తేదీన జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అహోబిలం పోలింగ్ కేంద్రంలో టీడీపీ రిగ్గింగ్‌కు (TDP Rigging) పాల్పడింది. పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేసి టీడీపీ శ్రేణులు చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సానుభూతిపరులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.
ధర్నా చేస్తున్న వైసీపీ మద్దతుదారులపైకి ఎమ్మెల్యే అఖిలప్రియ (MLA Akhila Priya) కాన్వాయ్‌లోని స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, నాగలక్ష్మి వాహనం కింద చిక్కుకుపోయారు. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను పోలీసుల (Police) సహాయంతో స్థానికులు బయటకు తీశారు. మరో ఇద్దరు మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగలక్ష్మి చివరకు ప్రాణాలు కోల్పోయారు.
నాగలక్ష్మి మృతిపై మాజీ ఎమ్మెల్యే గంగుల (Gangula) తీవ్రంగా స్పందించారు. అహోబిలం ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.








