ఏపీపైకి దూసుకొస్తున్న మరో పెను తుఫాన్.. భారీ వర్షాల హెచ్చరిక!

ఏపీపైకి దూసుకొస్తున్న మరో పెను తుఫాన్.. భారీ వర్షాల హెచ్చరిక!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుఫానులు వణికిస్తున్నాయి. ఇటీవల ‘అర్నాబ్’, ‘మురుసు’ తుఫానులు మిగిల్చిన నష్టం నుంచి ప్రజలు, రైతులు ఇంకా తేరుకోకముందే.. బంగాళాఖాతంలో మరో పెను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈ తుఫాను గమనం, తీవ్రత వేగంగా పెరగనుంది. కొద్ది గంటల్లోనే ఇది తుఫానుగా మారి, రేపటికి (నవంబర్ 17) తీవ్ర తుఫానుగా, ఎల్లుండికి (నవంబర్ 18) అతితీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది.

నవంబర్ 20వ తేదీ తెల్లవారుజామున లేదా మధ్యాహ్నం సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది. ముఖ్యంగా మచిలీపట్నం – బాపట్ల మధ్య ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో (గరిష్టంగా 145 కి.మీ వేగంతో) ప్రచండ గాలులు వీస్తాయని IMD హెచ్చరించింది.

తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోనుంది. నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా బాపట్ల, కృష్ణా, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచనతో రెడ్/ఆరెంజ్ అలర్ట్‌లు జారీ అయ్యాయి.

సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులకు 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 4 రోజుల పాటు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఐఎండీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment