హైదరాబాద్‌కు రాహుల్.. రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్‌కు రాహుల్.. రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే!

Summarize with AI

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, హెచ్‌ఐసీసీ నోవెటెల్ హోటల్‌లో బస చేయనున్నారు. పర్యటనలో భాగంగా గిగ్ వర్కర్లతో సమావేశం కావడంతో పాటు భారత్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. పార్టీ నాయకులతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

పర్యటన షెడ్యూల్ ప్రకారం రాత్రి ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హెచ్‌ఐసీసీ నోవెటెల్ హోటల్‌కు వెళ్లి బస చేస్తారు.

మరుసటి రోజు ఉదయం 11 గంటలకు శిల్పకళా వేదికకు చేరుకుంటారు. ఉదయం 11.15 గంటలకు అక్కడి నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు గిగ్ వర్కర్లతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి నోవెటెల్ హోటల్‌కు చేరుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్ సమ్మిట్‌కు హాజరైన విదేశీ ప్రతినిధులతో కలిసి భోజనం చేస్తారు.

సాయంత్రం 4 గంటలకు భారత్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు నోవెటెల్ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకునేలా పర్యటన షెడ్యూల్ రూపొందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment