జగన్ కుటుంబం టార్గెట్‌.. జనసేన ట్విట్టర్ స్పేస్‌లో బూతు పురాణం

జగన్ కుటుంబం టార్గెట్‌.. జనసేన ట్విట్టర్ స్పేస్‌లో బూతు పురాణం

Summarize with AI

జనసేన కార్యకర్తలు నిర్వహించిన ట్విట్టర్ స్పేస్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూష‌ణ‌లు చేశారు. పవన్ కల్యాణ్ మూడో భార్యతో విడాకుల ప్రచారం నేపథ్యంలో సంఘీభావం తెలిపేందుకు దాదాపు 350 మంది కార్యకర్తలతో ట్విట్టర్ స్పేస్ నిర్వహించి, వినడానికి, మాట్లాడ‌టానికి కూడా వీల్లేని రీతిలో బూతుల‌తో రెచ్చిపోయారు.

రాజకీయాల్లో ఉన్నవారు ఎవరికైనా కాసింతైనా నైతిక విలువలు ఉండాలని, కానీ అవి లేకపోగా ఇలాంటి సైకో బ్యాచ్‌ను తయారు చేసి సమాజంలోకి వదలడం అత్యంత దుర్మార్గమని వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడో భార్యకు విడాకుల సందర్భంగా సంఘీభావం ప్రకటించడం ఏంటి? దాని మీద 350 మంది కార్యకర్తలతో ట్విట్టర్‌లో చర్చ పెట్టడం ఏంటి? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. సంప్రదాయం, విలువలు ఉన్న ఏ పార్టీ అయినా అలా చేస్తుందా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

పైగా మాజీ ముఖ్య‌మంత్రి గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి ఇష్టానుసారంగా, నీచమైన భాషతో మాట్లాడటంపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడు ఎలా ఉంటే.. కార్యకర్తలు అలా ఉంటారనడానికి జనసేన ట్విట్టర్ చర్చే పెద్ద ఉదాహరణ అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్లంతా ఇలాంటి సోషల్ మీడియా సైకోలను తయారు చేసి రాష్ట్రంలో రాజకీయాలను దిగజార్చారని వైసీపీ శ్రేణులు ధ్వజమెత్తుతున్నాయి. జగన్ మీద, వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని వైసీపీ స్పష్టం చేసింది.

ఆ ట్విట్టర్ స్పేస్ నిర్వహించిన వారందరినీ తక్షణమే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment