ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 15 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, నవంబర్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. తొలి విడతలో ఎన్నికలు జరిగే జిల్లాలు, మండలాల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అనుబంధ జాబితాలో వెల్లడించింది.
తొలి విడత ఎన్నికల పూర్తి షెడ్యూల్
నవంబర్ 15: నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
నవంబర్ 17: నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
నవంబర్ 18: నామినేషన్ల పరిశీలన
నవంబర్ 19: నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్ల దాఖలు
నవంబర్ 20: అప్పీళ్ల పరిష్కారం
నవంబర్ 21: మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటన
నవంబర్ 26: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
నవంబర్ 26: మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల ప్రకటన
నవంబర్ 27: అవసరమైతే రీపోలింగ్
తొలి విడతలో ఎన్నికలు జరిగే మండలాలు ఇవే!
శ్రీకాకుళం: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, మందస, వజ్రపుకొత్తూరు.
విజయనగరం: బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, కొత్తవలస, లక్కవరపుకోట, శృంగవరపుకోట, వేపాడ.
పార్వతీపురం మన్యం: కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట.
అనకాపల్లి: అనకాపల్లి, కశింకోట, బుచ్చయ్యపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం, రావికమతం, రోలుగుంట.
అల్లూరి సీతారామరాజు: కొయ్యూరు, చింతపల్లి, జి.కె.వీధి, అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రాజవొమ్మంగి, రంపచోడవరం.
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం రూరల్, కడియం, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి.
కాకినాడ: కాకినాడ రూరల్, కరప, తాళ్లరేవు, పెద్దాపురం, సామర్లకోట.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ: అల్లవరం, అమలాపురం, ఐ.పోలవరం, కాట్రేనికోన, మలికిపురం, మామిడికుదురు, ముమ్మిడివరం, రాజోలు, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం.
పశ్చిమగోదావరి: ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నరసాపురం, మొగల్తూరు.
ఏలూరు: జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం, టి.నరసాపురం, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం.
కృష్ణా: బాపులపాడు, గన్నవరం, గుడ్లవల్లేరు, నందివాడ, ఉంగుటూరు, గుడివాడ.
ఎన్టీఆర్: విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం.
పల్నాడు: నరసరావుపేట, రొంపిచర్ల, బొల్లాపల్లి, ఇపూరు, సావల్యాపురం, వినుకొండ, నూజెండ్ల.
బాపట్ల: మార్టూరు, పర్చూరు, యద్దనపూడి, ఇంకొల్లు, చినగంజాం, కారంచేడు.
మార్కాపురం: కనిగిరి, పి.సి.పల్లి, సి.ఎస్.పురం, పామూరు, హెచ్.ఎం.పాడు, వెలిగండ్ల.
ప్రకాశం: కొండేపి, కొత్తపట్నం, ఒంగోలు, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, మర్రిపూడి, పొన్నలూరు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: అల్లూరు, బోగోలు, దగదర్తి, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వింజమూరు.
తిరుపతి: బుచ్చినాయుడుకండ్రిగ, సత్యవేడు, వరదయ్యపాలెం, కె.వి.బి.పురం, నాగలాపురం, నారాయణవనం, పిచ్చాటూరు, రేణిగుంట, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, చిట్వేలు, కోడూరు, ఓబులవారిపల్లె, పెనగలూరు, పుల్లంపేట.
చిత్తూరు: బైరెడ్డిపల్లె, గంగవరం, పలమనేరు, పెద్దపంజాణి, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం, శాంతిపురం.
అన్నమయ్య: చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, రాయచోటి, సంబేపల్లె.
వైఎస్సార్ కడప: అట్లూరు, బి.కోడూరు, బద్వేలు, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల, ఎస్.ఏ.కె.ఎన్., సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, టి.సుండుపల్లె, వీరబల్లి.
అనంతపురం: కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కంబదూరు, సెట్టూరు, కుందుర్పి, రాయదుర్గం, డి.హీరేహాళ్, బొమ్మనహాళ్, కనేకల్లు, గుమ్మఘట్ట, అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు.
శ్రీ సత్యసాయి: బత్తలపల్లి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, కనగానపల్లి, ముదిగుబ్బ, రామగిరి, తాడిమర్రి.
కర్నూలు: ఆదోని-1, ఆదోని-2, హొళగుంద, ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి.
నంద్యాల: అల్లగడ్డ, చాగలమర్రి, డోన్పాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ, నంద్యాల, గోస్పాడు.
తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయా మండలాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అన్ని ఏర్పాట్లు చేపట్టేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు.








