స్థానిక సంస్థల ఎన్నికలలో(Local Body Elections) అధికార కూటమి ప్రజాస్వామ్య ఉల్లంఘనలకు(Democratic Violations) అనంతపురం కార్పొరేషన్ (Anantapur Municipal Corporation) పరిధిలోని 30వ డివిజన్ ఫలితం షాక్ ఇచ్చింది. నామినేషన్ల ఘట్టం నుంచి ఓట్ల లెక్కింపు (Vote Counting) వరకు అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీని (YSRCP)అణచివేయాలని చూసిన పచ్చ నాయకులకు స్థానిక ఓటర్లు తమ తీర్పు ద్వారా గట్టి బుద్ధి చెప్పారు.
మంత్రి సత్యకుమార్(Minister Satyakumar) అనుచరులు (Followers) బహిరంగంగా రిగ్గింగ్‌కు (Open Rigging తెగబడిన బూత్‌లోనే (Polling Booth) ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి జయకేతనం ఎగురవేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం డివిజన్-30 (Anantapur Division-30) పరిధిలోని 3వ పోలింగ్ బూత్‌లో కేంద్ర మంత్రి సత్యకుమార్ ప్రధాన అనుచరులు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి, ఏకధాటిగా ఓట్లు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రిగ్గింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు, పోలింగ్ సిబ్బంది కళ్లముందే ప్రజాస్వామ్యాన్ని(Democracy) అపహాస్యం చేస్తూ కూటమి నేతలు సాగించిన ఈ అరాచకంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఎన్నికల సంఘం రీ-పోలింగ్(Re-polling) నిర్వహించింది. అధికార పార్టీ ఎంతటి భయాందోళనలు సృష్టించినా, ఓటర్లు అధైర్యపడకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి అనుచరులు దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసిన వార్డులో ప్రజా తీర్పు కూటమికి వ్యతిరేకంగా వ్యక్తమైంది. రిగ్గింగ్‌కు పాల్పడిన మంత్రి సత్యకుమార్ అనుచరుడు (Minister Satyakumar’s Follower) ఓడిపోయాడు. వైసీపీ అభ్యర్థి శివరామిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.








