వైఎస్సార్‌సీపీ (YSR Congress Party) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy) కూటమి సర్కార్ (Coalition Government) కుట్రలకు తెరలేపింది. పులివెందులలో(Pulivendula) హెలికాప్టర్ ల్యాండింగ్ కు (Helicopter Landing) ఆటంకాలు సృష్టించింది. నిన్న(శనివారం) హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు. చివరి నిమిషంలో అధికారులు మాట మార్చారు. మధ్యాహ్నం 2:30 తర్వాతే హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతిస్తామంటూ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ (Cherukuri Sridhar) కొత్త ఆదేశాలు జారీ చేశారు.
అయితే, అప్పటికే బెంగళూరు నుంచి హెలికాఫ్టర్‌లో వైఎస్ జగన్ బయలేర్దారు. వెనక్కి వెళ్లాలని హెలికాఫ్టర్ ఆపరేటర్‌కు అధికారులు ఫోన్ చేశారు. ఇంధన కొరతతో పులివెందులలో హెలికాఫ్టర్‌ను పైలట్.. ఎమర్జెన్సీ ల్యాండ్ (Emergency Landing) చేశారు. ఆఖరి నిమిషంలో అనుమతి ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.








