ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పోలీసుల వైఖరి తీవ్ర వివాదాస్పదమవుతోంది. శాంతిభద్రతలను (Law and Order) పరిరక్షించాల్సిన రక్షక భటులు.. అధికార పార్టీ నేతలకు సహకరిస్తూ, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ (Vijayawada) కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో(Krishna Lanka Police Station) జరిగిన లాకప్‌డెత్ (lock-up death) ఉదంతం మొదలు.. తాజాగా అనంతపురంలో జరిగిన ఘటన వరకు పోలీస్ శాఖ ప్రతిష్టపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అనంతపురంలో చనిపోయిన ఒక ఒంటరి మహిళకు చెందిన సుమారు కోటి రూపాయల విలువైన ఇల్లును(House) ఫోర్జరీ పత్రాలు(Forged Documents) సృష్టించి రిజిస్ట్రేషన్(Registration) చేయించుకున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ దందాలో ప్రధాన నిందితులుగా టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్(Daggubati Prasad) సమీప బంధువులైన అశోక్(Ashok), నాగసుందరకుమార్(Naga Sundara Kumar) ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి.
ఈ ఫోర్జరీ కేసులో నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు(State High Court) కొట్టివేసింది. న్యాయస్థానం బెయిల్(Bail) నిరాకరించినప్పటికీ, నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసులో పోలీసుల ద్వంద్వ వైఖరి ప్రజాస్వామ్యవాదులను, న్యాయ నిపుణులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నిందితులు దొరకడం లేదని, వారు పరారీలో ఉన్నారని పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం నిందితులుగా ఉన్న ఆ నేతలు టీడీపీ(TDP) అధికారిక కార్యక్రమాల్లో, ప్రజాప్రతినిధుల వెంటే బహిరంగంగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కంటిముందే తిరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తుండటం వెనుక తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని స్పష్టమవుతోంది.
సమాజంలో సామాన్యుడు చిన్న తప్పు చేసినా వెంటనే అరెస్టులు, విచారణల పేరుతో కఠినంగా వ్యవహరించే పోలీసులు.. అధికార పార్టీ అండదండలు ఉన్న బడా నేతలు, ప్రజాప్రతినిధుల బంధువుల విషయంలో మాత్రం చట్టాన్ని పక్కన పెట్టేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లాకప్‌డెత్‌లు(Lock-Up Deaths), అక్రమ అరెస్టులు(Illegal Arrests), సివిల్ సెటిల్మెంట్ల (Civil Settlements) నుంచి మొదలై ఇప్పుడు కోర్టు నివేదికల్లో కూడా తప్పుడు సమాచారం ఇచ్చే స్థాయికి దిగజారడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చట్టం ముందు అందరూ సమానులే అనే రాజ్యాంగ సూత్రానికి ఏపీ పోలీసులు తూట్లు పొడుస్తున్నారని నెటిజన్లు, విపక్షాలు మండిపడుతున్నాయి.








