హీరోయిన్గా సెటిల్ అవ్వాలనే ఆశతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నోరా ఫతేహీకి టాలీవుడ్ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ‘టెంపర్’ సినిమాలోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల’ స్పెషల్ సాంగ్‌తో ఒక్కసారిగా పాపులర్ అయిన ఆమె.. ఆ తర్వాత ఐటమ్ సాంగ్స్‌కు స్పెషలిస్ట్‌గా మారిపోయింది. హీరోయిన్ పాత్రల కంటే స్పెషల్ సాంగ్స్ ద్వారానే భారీ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే కొంతకాలంగా తెలుగులో నోరాకు అవకాశాలు తగ్గాయి. ‘మట్కా’ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించకపోవడంతో ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. ‘కేడీ ది డెవిల్’లోని స్పెషల్ సాంగ్‌పై డబుల్ మీనింగ్ లిరిక్స్, స్టెప్పుల విషయంలో విమర్శలు రావడంతో ఆ పాటపై వివాదం కూడా నెలకొంది.
ఇప్పుడు నోరా ఫతేహీ కోలీవుడ్లోకి అడుగుపెడుతున్న ‘జైలర్ 2’పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఇప్పటికే పూర్ణ ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయగా.. మరో స్పెషల్ సాంగ్ కోసం నోరాను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ‘జైలర్’లో తమన్నా ‘నువ్వు కావాలయ్యా’ పాటతో భారీ క్రేజ్ సంపాదించిన నేపథ్యంలో.. ‘జైలర్ 2’లోనూ స్పెషల్ సాంగ్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. నోరా నటించిన ఈ స్పెషల్ సాంగ్‌లో గ్లామర్‌తో పాటు డ్యాన్స్ స్టెప్పులు ఆకట్టుకునేలా ఉండనున్నట్లు టాక్. ఈ పాటతో నోరా ఫతేహీకి మళ్లీ వరుస అవకాశాలు వస్తాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








