తెలంగాణలో అక్టోబర్‌లో ఎండలేనా? ఐఎండీ కీలక అంచనా

తెలంగాణలో అక్టోబర్‌లో ఎండలేనా? ఐఎండీ కీలక అంచనా

Summarize with AI

భారత వాతావరణ శాఖ (IMD) అక్టోబర్‌ నెలకు సంబంధించిన వాతావరణ అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాల ప్రకారం తెలంగాణలో ఈ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణంగా అక్టోబర్‌లో వాతావరణం క్రమంగా చల్లబడాల్సి ఉండగా.. ఈసారి మాత్రం అధిక ఉష్ణోగ్రతలతో వేడి వాతావరణం కొనసాగే అవకాశముందని IMD తెలిపింది. భూమధ్యరేఖా పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు ఏడాది చివరి వరకు మరింత బలపడే అవకాశం ఉందని, హిందూ మహాసముద్రంపై ప్రస్తుతం తటస్థ ఐఓడీ పరిస్థితులు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు కొనసాగే శీతాకాలం ప్రారంభ సీజన్‌లోనూ తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగవచ్చని పేర్కొంది. దీంతో అక్టోబర్‌లో వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉండగా.. రాబోయే నెలల్లో వాతావరణ పరిస్థితులను ప్రజలు, రైతులు నిశితంగా గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment