ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా వేట షురూ.. సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్

ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా వేట షురూ.. సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్

Summarize with AI

ఏషియన్ గేమ్స్‌ 2026లో పురుషుల క్రికెట్‌ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని టీమిండియా సెప్టెంబర్‌ 28న ఉదయం 10 గంటలకు నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్‌ పార్క్‌లో తొలి మ్యాచ్‌ ఆడనుంది. గ్రూప్‌-Aలో రెండో స్థానంలో నిలిచే ఆఫ్ఘనిస్థాన్‌, జపాన్‌, నేపాల్‌లోని ఒక జట్టు భారత్‌కు ప్రత్యర్థిగా నిలవనుంది.

భారత్‌తో పాటు పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లకు కూడా నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ బెర్తులు దక్కాయి. గ్రూప్‌ దశలో ఆఫ్ఘనిస్థాన్‌, జపాన్‌, నేపాల్‌ గ్రూప్‌-Aలో.. హాంకాంగ్‌, మలేషియా, ఒమన్‌ గ్రూప్‌-Bలో తలపడనున్నాయి. సెప్టెంబర్‌ 28న భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ ఆడనుండగా.. సెప్టెంబర్‌ 29న మిగిలిన రెండు క్వార్టర్‌ఫైనల్స్‌, అక్టోబర్‌ 1న సెమీఫైనల్స్‌, అక్టోబర్‌ 3న పతక పోటీలు జరగనున్నాయి. హాంగ్‌జౌలో స్వర్ణం సాధించిన భారత్‌.. ఐచి-నగోయాలోనూ అదే జోరును కొనసాగించి మరోసారి బంగారు పతకం సాధించడంపై దృష్టి పెట్టింది.

Join WhatsApp

Join Now

Leave a Comment