NEET-PG 2026 ఫలితాలు విడుదల..

NEET-PG 2026 ఫలితాలు విడుదల..

Summarize with AI

వైద్య విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NEET-PG 2026 ఫలితాలు వచ్చేశాయి. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NBEMS) సెప్టెంబర్‌ 24న ఫలితాలను ప్రకటించింది. ఆగస్టు 30న నిర్వహించిన ప్రధాన పరీక్షకు 2,63,544 మంది హాజరుకాగా.. జైపూర్‌లోని సితాపురా కేంద్రాల్లో సాంకేతిక సమస్యతో పరీక్ష పూర్తికాని అభ్యర్థులకు సెప్టెంబర్‌ 5న రీ-ఎగ్జామినేషన్‌ నిర్వహించారు. ఇందులో 2,416 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అభ్యర్థుల రా స్కోర్‌, NEET-PG 2026 ర్యాంక్‌ వివరాలను NBEMS అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఫలితాలతో పాటు ఈసారి క్వాలిఫైయింగ్‌ కటాఫ్‌ మార్కులను కూడా NBEMS ప్రకటించింది. 720 మార్కులకు గాను జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు 262 మార్కులు, జనరల్‌ PwBD అభ్యర్థులకు 244 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఆయా కేటగిరీల PwBD అభ్యర్థులకు 226 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించింది. అంటే మీ స్కోర్‌ ఈ మార్కులను దాటిందా? అయితే తదుపరి దశలో పీజీ మెడికల్‌ సీటు కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ఇక అభ్యర్థులకు మరో ముఖ్యమైన సమాచారం కూడా ఉంది. వ్యక్తిగత స్కోర్‌కార్డులను అక్టోబర్‌ 1, 2026 తర్వాత NBEMS వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డులు జారీ తేదీ నుంచి ఆరు నెలలపాటు మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని NBEMS తెలిపింది. అలాగే NEET-PG 2026 ఆన్సర్‌ కీని కూడా అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులో ఉంచనుంది. స్టేట్‌ కోటా సీట్లకు సంబంధించిన మెరిట్‌ జాబితాలను ఆయా రాష్ట్రాలు తమ నిబంధనలు, రిజర్వేషన్‌ విధానాల ప్రకారం రూపొందించనున్నాయి. దీంతో ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది వైద్య విద్యార్థులకు కీలక ప్రక్రియ మొదలైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment