‘నైజీరియన్లు వేధిస్తున్నారు.. కాస్త విషం ఇవ్వండి’

‘నైజీరియన్లు వేధిస్తున్నారు.. కాస్త విషం ఇవ్వండి’

Summarize with AI

రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రా గౌడ తనకు జైలులో ఎదురవుతున్న ఇబ్బందులపై కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జైలులో ఉన్న పవిత్రా గౌడ.. తనను నైజీరియన్ మహిళలు వేధిస్తున్నారంటూ 59వ సీసీహెచ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తనకు బెయిల్ ఇవ్వాలని.. లేదంటే చనిపోవడానికి విషం ఇవ్వాలని పవిత్రా గౌడ కోర్టును కోరారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరుమున్నీరైనట్లు పేర్కొన్నారు. పవిత్రా గౌడ తరఫు న్యాయవాదులు కూడా కోర్టులో కీలక వాదనలు వినిపించారు. ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయని తెలిపారు. జైలులో ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు సిట్ తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. పవిత్రా గౌడను ఇప్పటికే మరో బ్యారక్‌కు మార్చామని కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను వాయిదా వేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment