ఏషియన్ గేమ్స్‌లో మను భాకర్ దూకుడు.. ఫైనల్‌కు అర్హత

ఏషియన్ గేమ్స్‌లో మను భాకర్ దూకుడు.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు అర్హత

Summarize with AI

ఏషియన్ గేమ్స్‌ 2026లో భారత స్టార్ షూటర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్ అదరగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన క్వాలిఫికేషన్‌లో మను మొత్తం 579 పాయింట్లు (20x) సాధించి మూడో స్థానంలో నిలిచింది. దీంతో టాప్‌-8 షూటర్లతో జరిగే ఫైనల్‌లో చోటు దక్కించుకుంది.

క్వాలిఫికేషన్‌లో మను ఆరంభంలో 95 పాయింట్లతో కొంత వెనుకబడినా.. ఆ తర్వాత పుంజుకుంది. రెండో సిరీస్‌లో 96, ఆ తర్వాతి సిరీస్‌లలో 96, 98 సహా స్థిరమైన స్కోర్లు నమోదు చేసి చివరకు మూడో స్థానానికి చేరుకుంది.

మరోవైపు ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న భారత షూటర్లు ఈషా సింగ్, సురుచి సింగ్ వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. ఈషా 572 పాయింట్లతో 15వ స్థానంలో, సురుచి 568 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచారు. మహిళల టీమ్ విభాగంలో మను భాకర్, ఈషా సింగ్, సురుచి సింగ్‌ కలిపి 1719 పాయింట్లు సాధించినప్పటికీ.. వియత్నాం కూడా 1719 పాయింట్లే సాధించింది.

అయితే వియత్నాం 46 ఇన్నర్‌-10లు నమోదు చేయగా భారత్‌ 44 మాత్రమే నమోదు చేయడంతో టైబ్రేకర్‌లో కాంస్యం వియత్నాంకు దక్కింది. ఈ నేపథ్యంలో మను భాకర్‌పై వ్యక్తిగత ఫైనల్‌లో భారత అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment