ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మరో ఉద్యోగ నియామకాల(Job Recruitment) గోల్‌మాల్‌కు తెరపడిందా..? ప్రజలు(Public), నిరుద్యోగుల(Unemployed)నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం(Government) యూటర్న్ తీసుకుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల (Veterinary Assistant Surgeons) నియామకంపై ఆంధ్రప్రదేశ్ ముచ్చటగా మూడోసారి జీవో విడుదల చేసింది. గతంలో అనుసరించిన విధానాన్ని మార్చి.. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను మళ్లీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి(APPSC) అప్పగించాలని నిర్ణయించింది. రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది.
ఈనెల 13వ తేదీన వెటర్నరీ సర్జన్ల నియామకానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) జీవో నంబర్ 21 జారీ చేసింది. పరీక్ష లేకుండా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలకు ఆదేశాలిచ్చింది. 24 గంటలు కూడా గడవకుండానే ఆ జీవోను మార్చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టాలని ఇచ్చిన మొదటి ఉత్తర్వుల్లో పరీక్ష లేకుండా మెరిట్ బేస్ మెథడాలజీతో (Merit-Based Methodology) నియమించాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీకి ఇచ్చినట్టే ఇచ్చి 24 గంటల్లోనే ఆ నియామకాల ప్రక్రియ పశుసంవర్థక శాఖ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తూ జీవో నంబర్ 22ను తెరపైకి తీసుకువచ్చింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకం పశుసంవర్థక శాఖ సెలక్షన్ కమిటీతో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది.
‘పరీక్షలు లేకుండా మరోస్కామా’ అంటూ టీవీలు, సోషల్ మీడియాలో కథనాలు, అందుకు సంబంధించిన జీవోలు ప్రసారం కావడంతో.. నిరుద్యోగులు, అభ్యర్థుల్లోనూ దీనిపై చర్చ జరిగింది. డీఎస్సీలో(DSC) వెలుగులోకి వస్తున్న నియామకాల తరహాలోనే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకం కూడా జరుగుతుందనే సందేహం నిరుద్యోగుల్లో పెరిగిపోయింది. 24 గంటల్లోనే రెండు జీవోలు మార్చి మార్చి ఇవ్వడంతో ఈ నియామక ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు బలపడ్డాయి.
దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది. నియామకాలను ఏపీపీఎస్సీకి కాకుండా ఇతర విధానంలో చేపట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వచ్చాయి. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో(DSC Sports Quota) జీవోలు మార్పు ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. తమ వారికి ఉద్యోగాలిచ్చేందుకు ఏపీపీఎస్సీ నుంచి నియామక బాధ్యతను తప్పించారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి.
పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి(Job Recruitment Without Examination) ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మీడియా వరుస కథనాలతో చంద్రబాబు ప్రభుత్వం వెంటనే దిగొచ్చింది. నియామకాల బాధ్యత పశుసంవర్థక శాఖ సెలక్షన్ కమిటీ నుంచి మళ్లీ ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారానే చేపట్టాలని నిర్ణయించింది. రాత పరీక్ష ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేసే విధానాన్ని అనుసరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీని ఏపీపీఎస్సీకి అప్పగించడంతో.. ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పోటీ పరీక్ష ద్వారా అవకాశం లభించనుంది. నియామక ప్రక్రియలో పారదర్శకత, మెరిట్‌కు ప్రాధాన్యం ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారు. మొత్తంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలపై చంద్రబాబు మూడు జీవోలతో యూటర్న్‌ల నిర్ణయం రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది.
చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్
— Telugu Feed (@Telugufeedsite) September 17, 2026
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లపై నిర్ణయం మార్పు
మళ్లీ ఏపీపీఎస్సీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చేందుకు మొదట నిర్ణయం
సాక్షి టీవీ ప్రసారాలతో ప్రజలు, నిరుద్యోగుల నుంచి… https://t.co/24ZBrWSEUw pic.twitter.com/F5GvfgX3Ad







