‘ఆకాశంలో ఒక తార’ రిలీజ్‌ డేట్‌ ఖరారు.. నవంబర్‌ 20న థియేటర్లలోకి

‘ఆకాశంలో ఒక తార’ రిలీజ్‌ డేట్‌ ఖరారు.. నవంబర్‌ 20న థియేటర్లలోకి

Summarize with AI

దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salmaan) ప్రధాన పాత్రలో పవన్‌ సాదినేని (Pawan Sadineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ (Aakasam Lo Oka Tara) సినిమా విడుదల తేదీ (Release Date) ఖరారైంది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. “ది జర్నీ టు ది స్టార్స్‌ బిగిన్స్‌”(The Journey to the Stars Begins) అంటూ సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ డేట్‌ను వెల్లడించారు. ప్రేక్షకులను ఓ అందమైన కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా రూపొందుతోందని మేకర్స్‌ తెలిపారు. దీంతో దుల్కర్‌ సల్మాన్‌ అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

గీతా ఆర్ట్స్‌(Geetha Arts), స్వప్న సినిమా(Swapna Cinema), లైట్‌బాక్స్‌(Lightbox) బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కీలక పాత్రలో నటిస్తున్నారు. పవన్‌ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ (G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. సత్యవీరవల్లి సినిమాటోగ్రఫీ, సుజిత్‌ సారంగ్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దుల్కర్‌ సల్మాన్‌, శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యం కావడంతో ‘ఆకాశంలో ఒక తార’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. “మీతో కలిసి ప్రయాణించండి.. మీ కోసం ఓ అందమైన ప్రపంచం ఎదురుచూస్తోంది” అంటూ చిత్రబృందం ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment