ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జరిగిన మెగా డీఎస్సీ నియామకాల్లో(Mega DSC Recruitments) అక్రమాలపై(Irregularities) తాజా పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కర్నూలులో స్పోర్ట్స్ కోటాలో(Sports Quota) ఉద్యోగం పొందిన ప్రభాకర్(Prabhakar) వ్యవహారం హాట్ టాపిక్ కాగా, శ్రీకాకుళం, కడప జిల్లా నుంచి కూడా స్పోర్ట్స్, దివ్యాంగుల కోటా ఉద్యోగాలకు సంబంధించి ఫిర్యాదులు అందడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో డీఎస్సీ స్కామ్‌పై(DSC Scam మాజీ మంత్రి, వైసీపీ(YSRCP) నేత పేర్ని నాని(Perni Nani) సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో జరిగింది మెగా డీఎస్సీ కాదని.. ‘యువగళం డీఎస్సీ’ (Yuvagalam DSC)అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రలోNara Lokesh Padayatra) పాల్గొన్న వారికి స్పోర్ట్స్ కోటా కింద టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. డీఎస్సీ వ్యవహారంలో ఒక్కో అంశాన్ని పరిశీలిస్తే అక్రమాలకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. గట్టిగా ఇరుక్కున్న చంద్రబాబు, లోకేష్ ఈ వ్యవహారం నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు(Chandrababu Naidu), లోకేష్‌కు (Lokesh)దమ్ముంటే స్పోర్ట్స్ కోటా కింద నియమితులైన టీచర్ల జాబితాను (Teachers List) బహిర్గతం చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చిన వ్యవహారంతో డీఎస్సీ అక్రమాలపై డొంక కదిలిందని, ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి అంశాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. కర్నూలులో ప్రభాకర్ గౌడ్(Prabhakar Goud) వ్యవహారంపై విచారణ జరిపితే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయన్నారు. టెట్ అర్హత లేకుండా ఉద్యోగం ఎలా ఇచ్చారో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడే ఐదుగురు స్పోర్ట్స్ కోటా టీచర్లు పనిచేస్తున్నారని, కౌతాళం మండలంలో 24 మంది స్పోర్ట్స్ కోటా ఉద్యోగులు ఉన్నారని చెప్పారు.
లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారంటూ పేర్ని నాని ఆరోపించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లను సరైన విధంగా వెరిఫికేషన్ చేయకుండా నియామకాలు ఎలా చేపట్టారని ప్రశ్నించారు. సర్టిఫికెట్లన్నింటిపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)(Sports Authority of Andhra Pradesh – SAAP) వ్యవహారంపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లాలో 79 మార్కులు వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎలా లభించిందో చెప్పాలని, తూర్పుగోదావరి జిల్లాలోనూ టెట్ అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారనే ఫిర్యాదులపై విచారణ జరపాలని కోరారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలన్నింటిపైనా సీబీఐతో(CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ అవసరమని చెబుతున్న ప్రభుత్వం.. ‘యువగళం టీచర్లకు టెట్ అవసరం లేదా?’ అని ఆయన ప్రశ్నించారు.
విద్యాశాఖ పనితీరుపైనా పేర్ని నాని విమర్శలు చేశారు. లోకేష్ అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటూ తన సొంత శాఖను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల భారం పెరుగుతోందని చెబుతున్న ప్రభుత్వం.. మరో డీఎస్సీ ఎందుకు నిర్వహిస్తామని ప్రకటిస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న పరిస్థితుల్లో కొత్త డీఎస్సీ అవసరం ఏమిటని నిలదీశారు. మెగా డీఎస్సీపై వస్తున్న ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే మరో డీఎస్సీ పేరుతో ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని పేర్ని నాని ఆరోపించారు.









అది క్లీన్చిట్ కాదు.. కేసు అబేట్! నా పోరాటం ఆగదు