నాన్నా.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా.. జగన్ భావోద్వేగ ట్వీట్

నాన్నా.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా.. జగన్ భావోద్వేగ ట్వీట్

Summarize with AI

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (Dr. YS Rajasekhara Reddy) వర్ధంతి (Death Anniversary) సందర్భంగా ఆయన తనయుడు, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి వైఎస్సార్‌ను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ‘నాన్నా.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా.. ఎప్పటికీ మీరే నాకు స్ఫూర్తి’ అంటూ జగన్ చేసిన భావోద్వేగ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం వైఎస్ జగన్ ఇడుపులపాయలోని (Idupulapaya) వైఎస్సార్ ఘాట్‌కు (YSR Ghat) చేరుకున్నారు. అక్కడ తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి, అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో(Special Prayers) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్ తన తండ్రితో తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. తండ్రి చూపిన ప్రజా సేవా మార్గంలో జ‌గ‌న్‌ ముందుకు సాగుతున్నార‌ని వైసీపీ శ్రేణులు కామెంట్లు పెడుతున్నారు.

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ.. వైఎస్సార్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చేసిన మేలును గుర్తుచేసుకుంటున్నారు. ‘వైఎస్సార్ ఆశయాలు సాధిస్తాం.. జోహార్ వైఎస్సార్’ (Johar YSR) అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment