ఢిల్లీలో(Delhi) ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ఆందోళనకు దిగారు. పెల్లెట్ గన్ దాడిలో గాయపడిన విద్యార్థులకు న్యాయం చేయాలని, ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ డీసీపీ (DCP) కార్యాలయం ఎదుట ధర్నా(Dharna) చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.
పెల్లెట్ గన్ ఘటనలో బాధిత విద్యార్థినితో(Victim Student) కలిసి రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు సమాచారం. తొలుత మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు (Mandir Marg Police Station) వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అనంతరం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు (Parliament Street Police Station) వెళ్లి కూడా ఇదే డిమాండ్ చేశారు.
అయితే ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో పోలీసులు నిరాకరించడంతో రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఢిల్లీ డీసీపీ కార్యాలయం (Delhi DCP Office) ఎదుట కూర్చొని ధర్నాకు దిగారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పెల్లెట్ గన్ ఘటనపై ఈనెల 17న ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసులు పట్టించుకోలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతోనే బాధిత విద్యార్థినితో కలిసి స్వయంగా పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఒకవైపు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేత ఆందోళనకు దిగడం.. మరోవైపు ఎఫ్ఐఆర్ నమోదుపై పోలీసులు స్పందించకపోవడం ఢిల్లీలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.








