ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలిలో(Legislative Council) డిప్యూటీ చైర్మన్ (Deputy Chairman) ఎన్నిక సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు (Thumati Madhavarao) శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా (Unanimously) ఎన్నికయ్యారు. అయితే ఆయనను చైర్లో కూర్చోబెట్టే కార్యక్రమానికి కూటమి సభ్యులు (Alliance Members) దూరంగా ఉండటంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూమాటి మాధవరావు డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయనను గౌరవప్రదంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు చైర్లో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే ఈ కార్యక్రమానికి మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. చైర్మన్ మోషేన్‌రాజు (Moshen Raju) అందరూ రావాలని ఆహ్వానించినప్పటికీ.. కూటమి సభ్యులు సభ నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
దీంతో వైసీపీ ఎమ్మెల్సీలే మాధవరావును డిప్యూటీ చైర్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అధికార పక్ష సభ్యులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం శాసనమండలి చరిత్రలోనే (Legislative Council History) దుదుస్సంప్రదాయంగా అభివర్ణిస్తున్నారు.
ఈ వ్యవహారంపై బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. సభలో గెలుపు, ఓటములు సహజమేనని.. కానీ సభా సంప్రదాయాలు, గౌరవాలు మాత్రం శాశ్వతంగా ఉండాలని అన్నారు. ‘‘డిప్యూటీ చైర్మన్‌ను చైర్‌పై కూర్చోబెట్టడానికి అధికార పార్టీ రాకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదు’’ అని బొత్స వ్యాఖ్యానించారు.
మంత్రులు రూల్స్ బుక్స్ పట్టుకుని నీతులు చెప్పడం మాత్రమే కాకుండా సభా విలువలు, సంప్రదాయాలను కూడా పాటించాలని సూచించారు. ‘‘డిప్యూటీ చైర్మన్‌కు గౌరవం ఇవ్వరా? చైర్ పట్ల అగౌరవంగా వ్యవహరించడం మంచిది కాదు. ప్రజలు అన్నింటినీ చూస్తున్నారు’’ అని బొత్స అన్నారు.
డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినందున కనీసం సంప్రదాయబద్ధంగా ఆయనను చైర్లో కూర్చోబెట్టే కార్యక్రమానికి అధికార పక్షం హాజరు కావాల్సి ఉందని వైసీపీ(YSRCP) నేతలు పేర్కొన్నారు. తూమాటి మాధవరావు డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉన్న రాజకీయ విభేదాలను మరోసారి బయటపెట్టింది.








