పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు

Summarize with AI

తెలంగాణలోని(Telangana) ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS)కు జాతీయ హోదా (National Project Status) కల్పించే అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ (Central Government) పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో(Rajya Sabha) కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdary) అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి (Raj Bhushan Choudhary) లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

జాతీయ ప్రాజెక్టు హోదా నిబంధనలు ఎన్ని ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని మంత్రి తేల్చిచెప్పారు.

కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 (KWDT-II) పరిధిలో న్యాయ విచారణలో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు టెక్నో–ఎకనామిక్ అప్రైజల్ (సాంకేతిక–ఆర్థిక మదింపు) చేపట్టడం సాధ్యపడదని పేర్కొన్నారు.

ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) తగిన ప్రణాళికలతో పునఃసమీక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే వెనక్కి పంపినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment