మెడికో కేసు.. యాక్సిడెంట్ కాదు ‘హత్యాయత్నమే’!

మెడికో కేసు.. యాక్సిడెంట్ కాదు ‘హత్యాయత్నమే’!

Summarize with AI

తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) రాజమహేంద్రవరంలో(Rajamahendravaram) తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే దారుణ సంఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో(Drunken State) ఊగిపోతూ ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సానికి ఓ మహిళా వైద్య విద్యార్థిని (మెడికో)(Female Medical Student) చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. జి.ఎస్.ఎల్. (GSL) మెడికల్ కాలేజీలో పీజీ డెర్మటాలజీ చదువుతున్న డాక్టర్ ప్రియాంకపైకి(Dr. Priyanka) ఉద్దేశపూర్వకంగానే కారు(Car) ఎక్కించి దారుణానికి ఒడిగట్టిన‌ట్టుగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

రాజ‌మండ్రి ఏవీ అప్పారావు (A.V. Appa Rao) రోడ్డులోని ప్రసాదిత్య మాల్ వద్ద ఈ ఘోరం జరిగింది. రాజమండ్రి రూరల్ చింతల నామవరానికి చెందిన సూరారపు ధన్వంత్(Surarapu Dhanwanth), ఆండ్రు జోసెఫ్‌లు (Andru Joseph) విపరీతంగా మద్యం సేవించి మాల్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. మద్యం మత్తులో ఉన్న వారిని మాల్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వారితో నిందితులు తీవ్రంగా ఘర్షణ పడ్డారు.

అనంతరం ఆక్రోశంతో బయటకు వచ్చిన నిందితులు, అదే సమయంలో మాల్ నుంచి స్కూటీపై బయలుదేరిన డాక్టర్ ప్రియాంకను (Dr. Priyanka) లక్ష్యంగా చేసుకున్నారు. స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను వెనుక నుంచి కారుతో బలంగా ఢీకొట్టారు. ఆమె కిందపడిపోగా.. రాక్షసత్వంతో మరో మూడుసార్లు కారును ఆమె తలపై నుంచి పోనిచ్చారు.

ఈ మొత్తం ఘోరం అక్కడ అమర్చిన సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయ్యింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ కాదని, ఉద్దేశపూర్వకంగానే కారుతో పలుమార్లు ఢీకొట్టి తలపై నుంచి వాహనాన్ని పోనిచ్చారని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్పష్టమైంది.

ఈ దాడిలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ఆమెను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితులు సూరారపు ధన్వంత్, ఆండ్రు జోసెఫ్ లను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక తండ్రి వెంకటేష్(Priyanka’s Father Venkatesh), మాల్ మేనేజరు విజయ్ (Mall Manager Vijay) ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రకాష్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ ఘాతకాన్ని సాధారణ “మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదం”గా మలిచేందుకు యత్నిస్తున్నారని బాధితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీలో స్పష్టమైన ఆధారాలు ఉన్నందున నిందితులపై సెక్సన్ 307 (హత్యాయత్నం – Attempt to Murder) కింద కఠిన కేసులు నమోదు చేసి, వారిని కఠినంగా శిక్షించాలని ప్రియాంక కుటుంబ సభ్యులు, తోటి వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment