‘ఏపీ సీఎం పవన్ కళ్యాణ్’.. – కేంద్రమంత్రి

'ఏపీ సీఎం పవన్ కళ్యాణ్'.. - కేంద్రమంత్రి

Summarize with AI

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభలో (Public Meeting) తీవ్ర ఆసక్తికర, చర్చనీయాంశమైన సంఘటన ఒక‌టి చోటుచేసుకుంది. కూటమి నేతలు (Alliance Leaders), శ్రేణులు వేలాదిగా హాజరైన భోగాపురం (Bhogapuram) అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhoopathiraju Srinivasa Varma) మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రసంగంలో ఆయన ఏపీ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) ఎవరనే విషయంపై తీవ్ర గందరగోళానికి గురయ్యారు.

సాధారణంగా ప్రధాని స్థాయి నాయకులు పాల్గొనే సభల్లో మాట్లాడేటప్పుడు నేతలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ వేదికపై పదే పదే ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి హోదాలను మర్చిపోవడం చర్చనీయాంశంగా మారింది.

భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport) ప్రారంభోత్స‌వ ప్రసంగంలో ఆయన ‘రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్'(Pawan Kalyan) అంటూ సంబోధించారు. త‌న‌ స్పీచ్ చివ‌ర్లో కూడా రాష్ట్రంలో అభివృద్ధికి తోడ్పడుతున్న ‘ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్’ అంటూ మళ్లీ పవన్ పేరునే సీఎంగా ప్రస్తావించారు.

గందరగోళం అక్కడితో ఆగలేదు.. ఆ తర్వాత సరిదిద్దుకునే క్రమంలో “సీఎం, డిప్యూటీ సీఎం నారా చంద్రబాబు” (Nara Chandrababu Naidu) అని అనడంతో సభకు వచ్చిన జనం నుంచి పెద్ద ఎత్తున కేకలు, నినాదాలు వినిపించాయి. అతి కష్టం మీద చివరికి ‘సీఎం చంద్రబాబు’ అని ఆయన అనగలిగి, స‌రిదిద్దుకోగ‌లిగారు.

ప్రధాని మోదీ సమక్షంలోనే కేంద్రమంత్రి ఇలా వరుసగా సీఎం, డిప్యూటీ సీఎం హోదాలపై గందరగోళానికి గురవ్వడంతో వేదికపై ఉన్న ముఖ్య నాయకులు కూడా కాసేపు అసహనానికి గురైనట్లు కనిపించింది. ఒకసారి నోరుజారితే పొరపాటు అనుకోవచ్చు కానీ, ఒకే సభలో పదే పదే పవన్ కళ్యాణ్‌ను ‘సీఎం’ అని సంబోధించడంతో.. “బహుశా కేంద్రమంత్రి మనసులో ఉన్న మాట, కోరికే బయటకు వచ్చిందేమో!” అని అక్కడున్న కూటమి నాయకులు, సభకు వచ్చిన జనం సరదాగా చర్చించుకోవడం కనిపించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment